రాష్ట్ర ప్రభుత్వానికి కొండా సురేఖ స్ట్రాంగ్ వార్నింగ్

కలం, వెబ్ డెస్క్: కారణం చెప్పకుండానే తనను మంత్రి వర్గం నుంచి తొలగించారని కొండా సురేఖ (Konda Surekha) ఆవేదన వ్యక్తం చేశారు. ఉరి శిక్ష వేసే ఖైదీకి కూడా చివరి అవకాశం ఉంటుందని, తనకు అలాంటిదేమీ ఇవ్వకుండానే పీకేశారన్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడే తన మనుషులను ఇబ్బంది పెట్టారని మండిపడ్డారు. మాజీ ఓఎస్డీ సుమంత్‌ అమాయకుడని, అతడిని కుట్ర పూరితంగా పోలీసులతో అరెస్ట్ చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సుమంత్‌‌పై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కర్ణాటకలో మహిళా మంత్రి లేరని ఓ వైపు ఆందోళనలు జరుగుతుంటే, ఇక్కడ మహిళా మంత్రిని తీసేయడమేంటన్నారు.

సజ్జనార్‌ని అడిగినా..

సీఎం దగ్గర ఉండే హరికృష్ణ అనే వ్యక్తి సుమంత్ పేరు చెప్పి డబ్బులు వసూళ్లు చేశాడని కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘హరికృష్ణను పోలీసులకు అప్పజెప్పి.. తాను ప్రెస్ మీట్ పెట్టి పూర్తి వివరాలు చెబుతామని సీపీ సజ్జనార్‌కి చెప్పాను. మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ప్రెసె మీట్ ప్రభుత్వానికి ఇబ్బంది కలుగుతుందని, ఈ విషయాన్ని వదిలేయాలని సజ్జనార్ చెబితే ఊరుకున్నాం. 24 గంటల్లోనే హరికృష్ణతో సుమంత్‌పై హత్యాయత్నం కేసు పెట్టించారు’ అని ఆరోపించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>