కలం, వెబ్ డెస్క్: తెలంగాణ రాజకీయాల్లో కొండా సురేఖ (Konda Surekha) వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన, ఇటు ప్రభుత్వంలో నెలకొన్న సంక్షోభంపై ఆమె వ్యాఖ్యలు చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రస్తుత పాలన తీరుపై సంతోషంగా ఉన్నారా? అని ఆమె ప్రశ్నించారు. ‘మీకు, నాకు అందరికీ తెలుసు ఎవరూ సంతోషంగా లేరు.. ఈరోజు నాకు జరిగింది రేపు మీకూ జరుగుతుంది, ఇప్పటికైనా బయటికి వచ్చి మాట్లాడండి” అంటూ తోటి నాయకులకు పిలుపునిచ్చారు.
ప్రజలకు ఇచ్చిన ఎన్నికల హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం వెనుకబడిందన్నారు. అందుకే ప్రభుత్వంపై వ్యతిరేకత ఏర్పడిందన్నారు. కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో పెరుగుతున్న ఈ వ్యతిరేకతపై కాంగ్రెస్ అధిష్ఠానం ఒక సమగ్ర సర్వే చేయించాలని కొండా సురేఖ సూచించారు.

