కలం, కరీంనగర్: కరీంనగర్ (Karimnagar) జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ (Gangula Kamalakar) అధికారిక క్యాంపు కార్యాలయం వద్ద కాంగ్రెస్ హామీలపై విమర్శిస్తూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. అయితే దానిని తొలగించాలని లేకపోతే బీఆర్ఎస్ పదేండ్ల పాలన పై ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తామని సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. కాంగ్రెస్ నేతలు హెచ్చరించినా బీఆర్ఎస్ నాయకులు ఆ ఫ్లెక్సీని తొలగించకపోవడంతో జిల్లా కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఇందిరా చౌక్ వద్ద ఆర్ అండ్ బీ గెస్ట్ హౌజ్ కూడలి వద్ద పదేళ్ల బీఆర్ఎస్ దోపిడీ అని ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటాపోటీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో పార్టీ శ్రేణుల్లో పొలిటికల్ వార్ నెలకొంది.
Also Read : రాష్ట్ర ప్రభుత్వానికి కొండా సురేఖ స్ట్రాంగ్ వార్నింగ్
Follow Us On: X(Twitter)

