epaper
Wednesday, February 18, 2026
epaper

చిట్యాల మున్సిపాలిటీని రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుతాం

కలం, నల్లగొండ బ్యూరో : చిట్యాల (Chityala) మున్సిపాలిటీని రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుతామని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం (Vemula Veeresham) తెలిపారు. చిట్యాల మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా 10వ వార్డు అభ్యర్థి సిలువేరు శేఖర్, 11వ వార్డు అభ్యర్థి బొబ్బలి సందీప – రాంరెడ్డికి మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించి మాట్లాడారు. ప్రజలకు సేవ చేసే గుణం శేఖర్‌లో ఉందని తెలిపారు. ఈ వార్డులో డ్రెయినేజీ సమస్య, తాగునీటి సమస్యలు ఉన్నాయని, వాటిని తప్పకుండా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ వార్డుకు 70 ఇందిరమ్మ ఇండ్లను కేటాయిస్తామని, అలాగే మున్సిపాలిటీ పరిధిలోని 12 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అత్యధిక మెజార్టీతో విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు.

గత ఎమ్మెల్యే తనను విమర్శించడం తప్ప ప్రజలకు ఏమీ చేయలేదని తెలిపారు. తాను 2014 నుంచి 2018 వరకు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో 250 ఇండ్ల నిర్మాణాలు చేపట్టామని గుర్తుచేశారు. చిట్యాలలోని ప్రభుత్వ ఆసుపత్రిని 30 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తామని, అలాగే చిట్యాలలోని మహిళా సంఘాలకు రైస్ మిల్లును కేటాయిస్తామని ఎమ్మెల్యే వేముల (Vemula Veeresham) హామీ ఇచ్చారు. మా పార్టీ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు.

Read Also: నాలుగు వారాల్లో కంప్లీట్ చేయండి.. డీజీపీ నియామకంపై ‘సుప్రీం’

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>