epaper
Wednesday, February 18, 2026
epaper

గ్రూప్‌-1 వ్య‌వ‌హారంలో హైకోర్ట్ తీర్పుపై స్పందించిన సీఎం రేవంత్

క‌లం, వెబ్ డెస్క్‌: తెలంగాణ గ్రూప్‌-1 నియామ‌కాల‌పై హైకోర్ట్ ఇచ్చిన తీర్పుపై సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) స్పందించారు. ఈ మేర‌కు ఎక్స్ వేదిక‌గా రేవంత్ రెడ్డి ఓ పోస్ట్ చేశారు. గ్రూప్ -1 నియామకాలపై హైకోర్టు (High Court) తీర్పును హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాన‌ని సీఎం పేర్కొన్నారు. చాలామంది ఎన్నో కుట్రలు చేసి గ్రూప్-1 ఉద్యోగ నియామకాలను అడ్డుకోవాలని చూశార‌ని సీఎం ఆరోపించారు. వారి కుట్రలు, కుతంత్రాలను ఛేదించి న్యాయ పోరాటంలో విజయం సాధించామ‌ని వెల్ల‌డించారు.

న్యాయస్థానం తీర్పు నేపథ్యంలో ఇప్ప‌టికే నియామ‌క ప‌త్రాలు అందుకున్న‌ 563 మంది గ్రూప్-1 అభ్యర్థులకు అభినంద‌న‌లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారి గ్రూప్-1 అధికారులుగా వీరంతా నియమితులయ్యార‌ని, ప్ర‌తి ఒక్క‌రూ రాష్ట్ర పునః నిర్మాణానికి పునరంకితం కావాలని పిలుపునిచ్చారు.

Read Also: పీఎం స్పీచ్ లేకుండానే లోక్‌సభ ఆమోదం

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>