కలం, హనుమకొండ: నాయీబ్రాహ్మణుల సంక్షేమానికి, వారి సమస్యల పరిష్కారానికి అండగా నిలుస్తున్న వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డికి నాయీబ్రాహ్మణ సంఘం వినూత్న రీతిలో కృతజ్ఞతలు తెలిపింది. నియోజకవర్గంలోని ప్రతి నాయీబ్రాహ్మణ షాప్, సెలూన్లో ఎమ్మెల్యే చిత్రపటాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
ఈ మేరకు మంగళవారం బాలసముద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో సెలూన్లలో ఏర్పాటు చేయనున్న చిత్రపటాలను ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి (Naini Rajender Reddy) చేతుల మీదుగా విడుదల చేశారు. తమ వృత్తికి గౌరవం, కుటుంబాలకు భరోసా కల్పించేందుకు ఎమ్మెల్యే అండగా నిలుస్తున్నారని, ఆయనకు కృతజ్ఞతగా చిత్రపటాలను ఏర్పాటు చేసుకుంటున్నట్లు సంఘం ప్రతినిధులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కొత్తపెల్లి శ్రీనివాస్, నాగవెల్లి సురేష్‌కుమార్, తూముల సాంబయ్య, కురిమిళ్ల రమేష్, నాగవెల్లి కృష్ణ, సూరయ్య, కోడెపాక రాజేందర్, నడిగోటి నవీన్, నాయీబ్రాహ్మణ ఉద్యోగుల సంఘం నాయకులు జంపాల యుగేందర్, మొగిలిచర్ల జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.

