కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) జిల్లా కేంద్రంలో శ్రీ చైతన్య పీజీ కళాశాల విశ్రాంత ప్రిన్సిపల్ నాగిళ్ల సదాశివ శర్మ నెల్లూరులో జరిగిన కార్యక్రమంలో ‘ఆచార్య రత్న’ పురస్కారాన్ని అందుకున్నారు. అఖిల భారత జాతీయ బ్రాహ్మణ ఐక్య వేదిక జాతీయ అధ్యక్షుడు అవధానం సాయికుమార్ చేతుల మీదుగా ఈ పురస్కారం అందుకున్నారు. శర్మ విద్యా రంగానికి ఆయన చేసిన కృషిని కొనియాడారు. అనంతరం శర్మను అధ్యాపకులు శాలువా కప్పి పుష్పగుచ్ఛాన్ని అందించి ఘనంగా సత్కరించారు. ఎం.దత్తాత్రేయ శర్మ, కె.వి.ఎన్.ఆచార్య, సుబ్రహ్మణ్య శర్మ, కె.శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

