కలం, వెబ్ డెస్క్ : జనసేన(Janasena) పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఢిల్లీలో కీలక కార్యక్రమాలకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 14 నుంచి 16 వరకు దేశ రాజధాని ఢిల్లీలో జనసేన ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనుంది. ఈ పర్యటనలో భాగంగా పవన్ కల్యాణ్ పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం కానున్నారు. అలాగే ‘సేన గళం’ కార్యక్రమం లక్ష్యాలు, ఉద్దేశాలను దేశ ప్రజలకు వివరించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా జనసేన పార్టీ ఆలోచనలు, విధానాలను జాతీయ స్థాయిలో చర్చకు తీసుకురావాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ కార్యక్రమాలలో పాల్గొనడానికి సుమారు 150 మంది జనసేన ముఖ్య నాయకులు ఢిల్లీకి వెళ్లనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పార్టీ అంతర్గతంగా విస్తృత స్థాయి ఏర్పాట్లు జరుగుతున్నాయి. జనసేన పార్టీ జాతీయ స్థాయిలో తన ప్రభావాన్ని విస్తరించేందుకు తీసుకుంటున్న ఈ చర్యలు రాజకీయ వర్గాలలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

