మంత్రులకు సీఎం చంద్రబాబు హెచ్చరికలు

కలం, వెబ్ డెస్క్: స్థానిక ఎన్నికల్లో (Local Body Elections) విజయం సాధించామని విర్రవీగొద్దని సీఎం చంద్రబాబు (CM Chandrababu) మంత్రులను హెచ్చరించారు. ఇక నుంచి మరింత బాధ్యతగా పనిచేయాలి తప్ప, గర్వం పనికిరాదన్నారు. కేబినెట్ భేటీ అనంతరం అధికారులను బయటకు పంపించి మంత్రులతో మాట్లాడిన సీఎం చంద్రబాబు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా బియ్యం ధరలు పెరగకుండా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉందని.. మంత్రులు చర్యలు తీసుకోవాలన్నారు.

2029 ఎన్నికల్లో మరోసారి గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సీఎం చంద్రబాబు (CM Chandrababu) సూచించారు. భవిష్యత్తుపై మరింత దృష్టి పెట్టాలని.. కూటమి పార్టీలు మరింత సమన్వయంతో క్షేత్రస్థాయిలో పనిచేయాలన్నారు. ఇదిలా ఉంటే, కేబినెట్ సమావేశంలో పలు అభివృద్ధి పనులు, ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. చాలా రోజుల తరువాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం మంత్రి వర్గ సమావేశానికి హాజరు కావడం గమనార్హం.

Also Read : రోబోటిక్స్​, ఫిజికల్​ ఏఐ పాలసీకి ఏపీ క్యాబినెట్ గ్రీన్​ సిగ్నల్​!

Follow Us On : WhatsApp

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>