పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ సంచలన పోస్ట్

కలం, వెబ్ డెస్క్: పవన్ కళ్యాణ్ విడాకులు (Pawan Kalyan Divorce) తీసుకుంటున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ఆయన మాజీ భార్య రేణు దేశాయ్ (Renu Desai) పెట్టిన ఇన్ స్టా పోస్ట్ ఆసక్తికరంగా మారింది. ‘ఒక వ్యక్తి కష్టంలో ఉన్నప్పుడు వారిని దూషించడం నైతికంగా కరెక్ట్ కాదు. ఇప్పటికే కిందపడిపోయిన వారిని తొక్కడం మానవత్వం అనిపించుకోదు. వాళ్లు ఏ స్థాయిలో ఉన్నా.. వాళ్లు కూడా ఒక మనిషి, ఒకరి సంతానం, తల్లిదండ్రులు లేదా మరొకరి తోబుట్టువులనే విషయం మర్చిపోకూడదు. మనమే లోపాలతో కూడిన గాజు గోడల ఇంట్లో ఉంటూ.. వేరే వాళ్ల ఇంటిపై రాళ్లు విసరొద్దు. తోటి మనుషుల పట్ల కాస్తంతా సానుభూతి, దయాగుణం ఉండటమనేది మనిషి ప్రాథమిక లక్షణం. నేను ఇలా రాసినందుకు అనవసరమైన ఊహాగానాలు చేయొద్దు. సమాజంలో ఉంటూ వీలైతే మంచి చేయాలి. అలాగే దయ, వివేకంతో ఇలా ఉండమని నాకు ఎవరూ పేటీఎం డబ్బులు చెల్లించలేదు. ఇదంతా మెదడుతో ఆలోచిస్తూ.. నేను చూసే విధానం అంతే!’ అని రాశారు.

ఈ పోస్టులో ఎక్కడా పవన్ కళ్యాణ్​ పేరుని రేణు దేశాయ్ (Renu Desai) ప్రస్తావించకపోయినా.. పవన్ కళ్యాణ్‌పై రకరకాల విమర్శలు చేస్తున్న వారినే ఉద్దేశించే రేణు దేశాయ్ ఇలా పోస్ట్ పెట్టి ఉంటారని భావిస్తున్నారు. రేణు దేశాయ్‌కు విడాకులు ఇచ్చిన అనంతరం అన్నా లెజినోవాను పవన్ వివాహం చేసుకున్నారు. 13 ఏళ్ల వారి బంధానికి స్వస్తి పలుకుతూ విడాకులు తీసుకుంటున్నట్లు సోమవారం రాత్రి ప్రకటించిన విషయం తెలిసిందే.

Also Read : మలయాళ చిత్ర పరిశ్రమలో విషాదం.. ప్రముఖ సినిమాటోగ్రఫర్ కన్నుమూత!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>