అక్కారం పంచాయతీలో నిధుల దుర్వినియోగం.. గ్రామస్తుల ఆగ్రహం!

కలం, అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలంలోని అక్కారం (Akkaram Funds) గ్రామపంచాయతీలో నిధులు దుర్వినియోగానికి గురైనట్లు ఆ గ్రామస్తుల నుంచి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా కలం 360 డిగ్రీస్ క్షేత్రస్థాయి పరిశీలన చేయగా మరికొన్ని అంశాలు వెలుగులోకి వచ్చాయి.

2005లో గ్రామపంచాయతీ పరిధిలో 2ఎకరాల భూమిని కొంతమందికి ఇళ్ల స్థలాలు కోసం కేటాయించారు. అయితే అందులో కేవలం 10 గుంటల భూమి మాత్రమే ప్లాట్లుగా మార్చారని, మిగతా భూమిని లబ్ధిదారులకు పూర్తిస్థాయిలో అందించలేదని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. అదేవిధంగా గ్రామంలో సిసి రోడ్లు వేయకుండానే, ఇతర గ్రామాల్లో వేసిన రోడ్లను చూపించి ఎంబిలు తయారు చేసి అధికారులతో అక్రమ ఒప్పందం కుదుర్చుకొని బిల్లులు డ్రా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. కొన్ని రోడ్లలో కొంతమేర మట్టి కొట్టించి అధికంగా బిల్లులెత్తారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

వీటన్నింటిపై పూర్తిస్థాయిని విచారణ జరపాలని కొంతమంది గ్రామ వ్యక్తులు కలెక్టర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదులు కూడా చేశామని తెలిపారు. అయినప్పటికీ రాజకీయ అండదండలతో అక్కారం గ్రామంలో నిధులు దుర్వినియోగానికి గురైన పట్టించుకోవడంలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ రంగంలోకి దిగి పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేసి దుర్వినియోగానికి గురైన నిధులను వెలికితెచ్చి న్యాయం చేయాలని వారు కోరుతున్నారు . అదే విధంగా నిధుల దుర్వినియోగానికి సహకరించిన పంచాయతీ కార్యదర్శి ,ఎంపీడీవో, ఏఈ అధికారాలపై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని అక్కారం గ్రామస్తులు కోరుతున్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>