మియాపూర్‌లో అగ్ని ప్రమాదం.. రూ.60 లక్షల ఆస్తి బుగ్గిపాలు!

కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం (Hyderabad Fire Accident) చోటు చేసుకుంది. మియాపూర్ పీఎస్ పరిధిలోని హఫీజ్‌పేట్ ఫ్లైఓవర్ పక్కనే ఉన్న ఓ పెయింటింగ్ షాపులో శనివారం తెల్లవారు జామున మంటలు చెలరేగాయి. షాపులో పెయింటింగ్ డబ్బాలు ఉండడంతో దట్టమైన పొగల అలుముకుంది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. అయితే, అప్పటికే దుకాణంలోని సామాగ్రి మొత్తం బుగ్గి పాలయింది. అగ్ని ప్రమాద ఘటనలో రూ.60 లక్షలకు పైగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ప్రమాద సమయంలో దుకాణంలో ఎవరూ లేకపోవడంతో భారీ ప్రాణ నష్టం తప్పింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే అగ్ని ప్రమాదం జరిగిందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>