అరేబియా సముద్రంలో రూ.3 వేల కోట్ల డ్రగ్స్ పట్టివేత

కలం, వెబ్ డెస్క్ : లక్షద్వీప్‌కు పశ్చిమాన అరేబియా సముద్రంలో (Arabian Sea) భారీ మొత్తంలో అక్రమ మాదకద్రవ్యాలను భారత భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి (Drugs Seized). ఇండియన్ కోస్ట్ గార్డ్, గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ATS) సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో ఇరాన్‌కు చెందిన ఓపడవను అడ్డుకుని తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పెద్ద మొత్తంలో హెరాయిన్, మెథాంఫెటమైన్ బయటపడింది. పట్టుబడిన డ్రగ్స్ విలువ రూ.3 వేల కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇరాన్ పడవలో భారీగా మాదకద్రవ్యాలు

అరేబియా సముద్రంలో అనుమానాస్పదంగా కదులుతున్న ఇరాన్‌కు చెందిన పడవపై (Iranian Boat)నిఘా పెట్టిన కోస్ట్ గార్డ్, గుజరాత్ ATS బృందాలు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించాయి. పడవను అడ్డుకుని పూర్తిస్థాయిలో తనిఖీలు చేపట్టగా 526 కిలోల హెరాయిన్, మెథాంఫెటమైన్ గుర్తించారు. భారీ మొత్తంలో డ్రగ్స్ లభించడంతో అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు.

ఐదుగురు పాకిస్థానీయులు అదుపులోకి

పడవలో ఉన్న ఐదుగురు పాకిస్థానీయులను భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. మాదకద్రవ్యాల రవాణాకు సంబంధించి వారి పాత్రపై అధికారులు విచారణ చేపడుతున్నారు. డ్రగ్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఎక్కడికి తరలిస్తున్నారు? ఈ వ్యవహారం వెనుక ఎవరెవరు ఉన్నారు? అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది.

తదుపరి దర్యాప్తు కోసం ముంబైకి తరలింపు

స్వాధీనం చేసుకున్న డ్రగ్స్‌తో పాటు ఇరాన్ పడవను, అదుపులోకి తీసుకున్న ఐదుగురిని తదుపరి దర్యాప్తు కోసం ముంబైకి తరలించారు. సముద్ర మార్గంలో జరుగుతున్న అంతర్జాతీయ మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై అధికారులు మరింత లోతుగా దర్యాప్తు చేయనున్నారు. ఈ వ్యవహారంలో అంతర్జాతీయ డ్రగ్స్ నెట్‌వర్క్‌కు సంబంధాలు ఉన్నాయా అనే కోణంలోనూ దర్యాప్తు సాగుతోంది.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>