సోనియా గాంధీ వల్లే తెలంగాణ వచ్చింది: మంత్రి కోమటిరెడ్డి

కలం, వెబ్ డెస్క్: సోనియా గాంధీ లేకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదన్న విషయం దేశం మొత్తానికి తెలుసని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) అన్నారు. శనివారం హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీ నోవాటెల్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు.

గతంలో అసెంబ్లీ సాక్షిగా సోనియా గాంధీని తెలంగాణ దేవత అని కేసీఆర్ అన్నారని, కుటుంబంతో సహా వెళ్లి ఆమె కాళ్లు మొక్కారని కోమటిరెడ్డి గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా గాంధీ ఇచ్చారనే నిజం ప్రతి ఒక్కరికీ తెలుసని ఆయన పేర్కొన్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం రాహుల్ గాంధీదని, దేశమే తన కుటుంబం అని తిరుగుతున్న వ్యక్తి రాహుల్ గాంధీ అని కొనియాడారు. కేటీఆర్ లాగా ఆయన తండ్రి చాటు కుమారుడు కాదని విమర్శించారు.

దళిత ముఖ్యమంత్రిని చేయకపోతే మెడ మీద తలకాయ ఉండదని ఆనాడు కేసీఆర్ అనలేదా అని మంత్రి ప్రశ్నించారు. కేటీఆర్ ఏదైనా మాట్లాడే ముందు ఆలోచించుకొని మాట్లాడాలని హితవు పలికారు. అడ్డగోలుగా హామీలు ఇచ్చి పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగిన కేసీఆర్, మైనార్టీలు, గిరిజనులతో పాటు తెలంగాణ ప్రజలను అనేక రకాలుగా మోసం చేశారని ఆరోపించారు. అందుకే ప్రజలు వారిని ఇంటికే పరిమితం చేశారని అన్నారు.

ప్రస్తుత ప్రజా ప్రభుత్వంలో అమలవుతున్నన్ని సంక్షేమ పథకాలు దేశంలో మరే రాష్ట్రంలోనూ అమలు కావడం లేదని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ చేతుల మీదుగా గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం పాలసీ తీసుకొచ్చి పథకాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో దేశానికి రాహుల్ గాంధీ ప్రధాని కాబోతున్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>