నవంబర్ 25న ‘వృషకర్మ’ ట్రైలర్

క‌లం, సినిమా: యువ సామ్రాట్ నాగ చైతన్య ఇంతకుముందెన్నడూ చూడని కొత్త పాత్రలో నటిస్తున్న మైథలాజికల్ థ్రిల్లర్ ‘వృషకర్మ’ (Vrushakarma). కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా డిసెంబర్ 4న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఎస్‌వీసీసీ, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బాపినీడు, బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మైథాలజీ, మిస్టరీ, సస్పెన్స్ కలయికతో ఒక భారీ సినిమాటిక్ స్పెక్టకల్‌గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. పురాతన రహస్యాలు, మిస్టీరియస్ అంశాలతో కూడిన ఆసక్తికరమైన ప్రపంచంలోకి ప్రేక్షకులను తీసుకెళ్లబోతోంది.

తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను నవంబర్ 25న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. నెల్లూరులోని ‘SV కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌’లో జరిగే గ్రాండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో విడుదల చేయనున్నారు. ట్రైలర్ అనౌన్స్‌మెంట్ పోస్టర్ కూడా సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది. ఈ పోస్టర్‌లో నాగ చైతన్య ఇంటెన్స్, డిటర్మైండ్ ఎక్స్‌ప్రెషన్‌తో కనిపిస్తున్నారు. భుజంపై తాడు వేసుకుని, ఒక చేతిని ముందుకు చాపిన స్టైలిష్ లుక్ ఆకట్టుకుంటోంది. కళ్లద్దాలు, ఒత్తైన గడ్డంతో జయరామ్ కనిపిస్తుండగా, మరోవైపు కళ్లద్దాలు ధరించిన మీనాక్షి చౌదరి చేతిలో నిప్పుతో ఉన్న వస్తువును పట్టుకుని కనిపిస్తున్నారు. ఈ విజువల్ పోస్టర్‌కు మరింత మిస్టికల్ టచ్ ఇచ్చింది. 25న ట్రైలర్ రిలీజ్ కానుండటంతో ‘వృషకర్మ’లోని ఆసక్తికరమైన ప్రపంచం గురించి మరిన్ని విషయాలు తెలియనున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>