పాలిటెక్నిక్ కళాశాలకు పూర్వ వైభవం తెస్తాం: మేఘా రెడ్డి

కలం, వనపర్తి: పట్టణంలోని చారిత్రక పాలిటెక్నిక్ కళాశాల భవనానికి పూర్వవైభవం తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి (MLA Megha Reddy) తెలిపారు. ఆదివారం మార్నింగ్‌ వాక్‌లో భాగంగా ప్రాచీన పాలిటెక్నిక్ కళాశాలను సందర్శించిన ఆయన భవన పరిస్థితిని పరిశీలించారు. కళాశాల పునరుద్ధరణకు ప్రభుత్వం ఇప్పటికే రూ.10 కోట్ల నిధులు మంజూరు చేసిందని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు.

పట్టణానికి గుర్తింపుగా నిలిచే చారిత్రక కట్టడాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ సందర్భంగా కళాశాల ఆవరణలో క్రికెట్‌ ఆడుతున్న విద్యార్థులతో కలిసి కొద్దిసేపు ఆటలో పాల్గొని సందడి చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ మధుసూదన్‌గౌడ్‌, పట్టణ అధ్యక్షుడు కదిరె రాములు, పార్టీ నాయకులు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>