కలం, వెబ్ డెస్క్ : కర్ణాటకలో పేలుడు కలకలం రేపింది. మైసూరులోని అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో బ్లాస్ట్ (Mysuru Blast) లో ఒకరు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా, గ్యాస్ సిలిండర్ వల్లే పేలుడు సంభవించినట్లు పోలీసులు భావిస్తున్నారు.


