epaper
Wednesday, February 18, 2026
epaper

చైతన్యపురిలో నరబలి కలకలం!

కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లోని చైతన్యపురి (Chaitanyapuri) ప్రాంతంలో నరబలి వార్త కలకలం రేపింది. చైతన్యపురిలో ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న వైశ్యరాజు జ్యువెలర్స్‌లో వాచ్‌మన్‌గా పనిచేస్తున్న ముత్తయ్య అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి (Mystery Death)  చెందడం తీవ్ర సంచలనంగా మారింది. ముత్తయ్య కొంతకాలంగా జ్యువెలరీ షాపులో వాచ్‌మన్‌గా పనిచేస్తున్నాడు. అయితే అతడి మృతదేహం షాప్ పరిసరాల్లో కనిపించడంతో స్థానికులు, కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. షాప్ ప్రారంభోత్సవానికి ముందు నరబలి ఇచ్చారనే అనుమానాలు వ్యక్తం చేశారు.

ముత్తయ్యను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అసలు ఇది ఆత్మహత్యా? లేక హత్యా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది. ఈ సంఘటనతో చైతన్యపురి ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Read Also: తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>