కలం, వెబ్ డెస్క్: టాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్ విజయ్ దేవరకొండ – రష్మిక మందాన (Vijay Devarakonda – Rashmika Mandanna) పెళ్లి పీటలేక్కబోతున్నారు అనే వార్త కొద్దిరోజులుగా తెగ వైరల్ అవుతోంది. అయితే అభిమానులు ఈ వార్త నిజామా కాదా ఎటూ తేల్చుకోలేని డైలమాలో ఉండగా ఓ ఇన్విటేషన్ కార్డు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. వీరి వివాహంపై అధికారికంగా ధ్రువీకరణ వచ్చేసిందోచ్ అనుకుంటూ అభిమానులు సంతోషపడిపోతున్నారు.
ఆ ఆహ్వానపత్రిక ప్రకారం… విజయ్-రష్మిక (Vijay-Rashmika) ఫిబ్రవరి 26, 2026 న అత్యంత సన్నిహితుల మధ్య, చిన్న వేడుకలో పెళ్లి చేసుకోబోతున్నారు. పెళ్లి తర్వాత కుటుంబసభ్యులు, సినీ ప్రముఖులు, స్నేహితుల సమక్షంలో వెడ్డింగ్ రిసెప్షన్ నిర్వహించనున్నారు. మార్చ్ 4న రాత్రి 7 గంటల నుంచి హైదరాబాద్ బంజారాహిల్స్ లోని తాజ్ కృష్ణా లో ఘనంగా ఈ వేడుక నిర్వహించనున్నారు.
ఆహ్వాన పత్రికలో విజయ్ దేవరకొండ తన పేరుతో రాసిన లేఖలో ఇలా పేర్కొన్నారు. “మా జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నాం. ఇరు కుటుంబాల ఆశీర్వాదంతో నేను, రష్మిక ఫిబ్రవరి 26, 2026న చిన్న, సన్నిహిత వేడుకలో పెళ్లి చేసుకుంటున్నాం. మా జర్నీలో భాగమైన మీ అందరి ప్రజెన్స్, బ్లెస్సింగ్స్ మాకు చాలా స్పెషల్. మీరు మా రిసెప్షన్ కి హాజరై, మమ్మల్ని ఆశీర్వదించాలని నేను, రష్మిక హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం” అని ఇన్విటేషన్ కార్డులో ఉంది.

Read Also: మూవీ సెట్స్ లో ప్రభాస్ కు గాయాలు..!
Follow Us On: Sharechat


