కలం, వెబ్ డెస్క్ : విశాఖపట్నం సమీపంలోని ఎండాడ (Yendada) ప్రాంతంలో ఆకాశంలో కొన్ని వింత ఆకారాలు దర్శనమివ్వడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఆకాశంలో విచిత్రమైన వెలుగులు, వింత రూపాలు సంచరిస్తున్నట్లు గమనించిన ప్రియదర్శిని అనే యువతి వెంటనే తన మొబైల్ ఫోన్ ద్వారా ఆ దృశ్యాలను వీడియో తీసింది.
అనంతరం ఈ వీడియోను సోషల్ మీడియా వేదికగా పంచుకోవడంతో అది కాస్తా నెట్టింట వైరల్ గా మారింది. ఆకాశంలో కనిపించిన ఈ వింత రూపాలను చూసి స్థానికులు ఆశ్చర్యానికి గురవ్వడమే కాకుండా, రకరకాల సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు ఇవి ఏదైనా ఖగోళ వింతనా లేక ఏలియన్స్ అయి ఉంటాయా అని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్ల దృష్టిని ఆకట్టుకుంటోంది.
ఆకాశంలో వింత దృశ్యాలు
-వైజాగ్ సమీపంలోని ఎండాడ ప్రాంతంలో ఆకాశంలో వింత దృశ్యాలు!
-మొబైల్ ఫోన్ ద్వారా ఆ దృశ్యాలను వీడియో తీసిన ఓ యువతి
-సోషల్ మీడియా వేదికగా పంచుకోవడంతో రకరకాల సందేహాలు వ్యక్తం చేస్తున్న నెటిజన్లు
Mysterious Shapes and Lights in Yendada Sky Spark Alien… pic.twitter.com/Wbo4emfVdH— Kalam Daily (@kalamtelugu) August 29, 2026

