విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన పౌష్టికాహారం: ఎమ్మెల్యే వేముల వీరేశం

కలం, నకిరేకల్: విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు సరైన పౌష్టికాహారాన్ని అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని నకిరేకల్ ఎమ్మెల్యే (Nakrekal MLA), ప్రభుత్వ విప్ వేముల వీరేశం (Vemula Veeresham) అన్నారు. శనివారం నల్గొండ (Nalgonda) జిల్లా నకిరేకల్‌లోని గురుకుల పాఠశాలలో విద్యార్థులకు ప్రభుత్వం సరఫరా చేసిన యూనిఫామ్‌లు, స్కూల్ బ్యాగులను ఆయన ముఖ్య అతిథిగా హాజరై పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ.. గురుకుల విద్యార్థుల సంక్షేమం కోసం ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

పెరిగిన ధరలకు అనుగుణంగా విద్యార్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మెస్ చార్జీలను కూడా ప్రభుత్వం పెంచిందని తెలిపారు. పాఠశాలల్లో నాణ్యమైన ఆహారాన్ని అందించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో లభిస్తున్న సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని, బాగా చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి, పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందితో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>