కలం, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ శ్రేణులు దాడులు చేస్తే ఎదురు దాడులు చేయాలని కాంగ్రెస్ శ్రేణులకు సీనియర్ నేత మైనంపల్లి హన్మంత రావు (Mynampally Hanumanth Rao) పిలుపునిచ్చారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR)పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ అల్వాల్‌లో ఓటర్ అవగాహన కార్యక్రమానికి హాజరై మైనంపల్లి గుండాయిజం చేస్తున్నారంటూ నోటికొచ్చినట్లు మాట్లాడాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా చాలెంజ్‌లు చేస్తున్నాడని, తనపై రౌడీయిజం ఆరోపణలు చేస్తూ ఇష్టారీతిన మాట్లాడుతున్నాడని, ఇలా చాలెంజ్ చేసే ముందు మీసాలు పెంచుకోవాలని ఎద్దేవా చేశారు.
బీఆర్ఎస్ పాలనలో కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్‌లు (Phone Tapping) చేస్తూ సెలబ్రెటీల జీవితాలు నాశనం చేశాడన్నారు. కేటీఆర్ (KTR) తెలంగాణ ఉద్యమం చేయలేదని, అమెరికా నుంచి ఊడిపడి ఉద్యమకారుడైన కేకే మహేందర్ రెడ్డికి అన్యాయం చేశాడని ఆరోపించారు. కేటీఆర్ సెలబ్రెటీలతో పాటు చాలా మంది జీవితాలను నాశనం చేశాడని సిరిసిల్ల (Sircilla) ప్రజలే చెప్తున్నారన్నారు. ఇసుక మాఫియాతో సిరిసిల్లలో వేల కోట్లు సంపాదించుకున్నాడని, ఎనిమిది మంది దళితులకు థర్డ్ డిగ్రీ ఇప్పించి చిత్రహింసలు పెట్టారని ఆరోపించారు.
మంథనిలో మిట్ట మధ్యాహ్నం నడి రోడ్డు పై హత్య చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీకే దక్కిందన్నారు. తనపై గూండాయిజం ఆరోపణలు చేస్తున్న కేటీఆర్ సమాజ సేవా కార్యక్రమాల గురించి ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. ఇప్పటి వరకు పట్టించుకోలేదని ఇక కేటీఆర్ సిరిసిల్ల నియోజకవర్గానికే వచ్చి కూర్చుంటామని, కేటీఆర్ చేసే గూండాయిజంపై హీరోయిజం చేస్తామని మైనంపల్లి (Mynampally) హెచ్చరించారు.
Read Also: సిరిసిల్ల సీట్.. పెరుగుతున్న పొలిటికల్ హీట్!
Follow Us On: Instagram

