హర్ ఘర్ తిరంగా విజయవంతానికి కృషి చేయాలి: ఎమ్మెల్యే ఏలేటి

కలం, నిర్మల్: హర్ ఘర్ తిరంగా, తిరంగా ర్యాలీ కార్యక్రమాలను జిల్లావ్యాప్తంగా విజయవంతంగా నిర్వహించేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి (Alleti Maheshwar Reddy) అన్నారు. బుధవారం బీజేపీ పార్టీ కార్యాలయంలో జిల్లా పదాధికారుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ప్రతి గ్రామం, ప్రతి బూత్ స్థాయిలో విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన కార్యాచరణపై చర్చించారు.

పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి ప్రజలను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలన్నారు. దేశభక్తిని చాటిచెప్పే హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో ప్రతిఒక్కరూ పాల్గొని, జాతీయ పతాక గౌరవాన్ని మరింత పెంపొందించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బీజేపీ కౌన్సిలర్లు, సర్పంచ్‌లు, జిల్లా పదాధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>