భద్రాచలంలో ‘లాక్టేషన్ మేనేజ్‌మెంట్ యూనిట్’ ప్రారంభం

కలం, భద్రాచలం: నవజాత శిశువుల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు తల్లిపాలు అమూల్యమైనవని ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ రాహుల్ అన్నారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా భద్రాచలం (Bhadrachalam ) లోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నవజాత శిశువుల ఆరోగ్య సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన ‘లాక్టేషన్ మేనేజ్‌మెంట్ యూనిట్’ ను బుధవారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పీఓ మాట్లాడుతూ, బిడ్డ పుట్టిన మొదటి ఆరు నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే అందించేలా ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని పిలుపునిచ్చారు.

​ఈ యూనిట్ ద్వారా అకాల ప్రసవం వల్ల పుట్టిన శిశువుల తల్లుల నుండి ముర్రు పాలను పరిశుభ్రంగా సేకరించి భద్రపరుస్తామని, బాలింతలకు సరియైన పాలిచ్చే విధానాలపై ప్రత్యేక శిక్షణ, కౌన్సెలింగ్ అందిస్తామని వైద్యాధికారులు తెలిపారు. ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వై. రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో డీసీహెచ్‌ఎస్ డాక్టర్ రవిబాబు, డీఎంహెచ్‌వో డాక్టర్ తుకారం రాథోడ్, అడిషనల్ డీఎంహెచ్‌వో డాక్టర్ సైదులుతో పాటు ఆర్‌ఎంవోలు, పలువురు వైద్యులు, నర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>