మయన్మార్​లో భూకంపం.. కోల్​కతాలో ప్రకంపనలు

కలం, వెబ్​డెస్క్​: మయన్మార్​లో మంగళవారం భూకంపం వచ్చింది(Myanmar Earthquake). దీని ప్రభావం సరిహద్దులోని భారత్​పైనా కనిపించింది. ఈశాన్య రాష్ట్రాలతో పాటు పశ్చిమ బెంగాల్​లోనూ స్పల్ప స్థాయి ప్రకంపనలు వచ్చాయి. రాత్రి 9.05 నిమిషాల సమయంలో కోల్​కతాలో దాదాపు 15 సెకన్ల పాటు స్వల్పంగా భూమి కంపించినట్లు స్థానికులు తెలిపారు. ప్రకంపనల కారణంగా వస్తువులు ఊగడం, కింద పడడంతో జనం ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

జర్మన్​ రీసెర్చ్​ సెంటర్​ ఫర్​ జియోసైన్స్​(GFZ) తెలిపిన వివరాల ప్రకారం.. సెంట్రల్​ మయన్మార్​లోని యెనాంగ్​యాయూంగ్​ సిటీకి 95 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉంది. భూమి లోపల 10 కి.మీ లోతున మొదట 6.0 తీవ్రతతో భూకంపం వచ్చింది. అనంతరం దాన్ని అనుసరించి మరికొన్నిసార్లు భూమి కంపించింది. భూకంప కేంద్రం తక్కువ లోతులో ఉండడంతో ప్రభావం సుదూర ప్రాంతాల్లోనూ కనిపించినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. కాగా, మయన్మార్​లో భూకంపం కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం ఎంత జరిగిందనేది ఇప్పటివరకు తెలియరాలేదు.

భౌగోళికంగా భూకంప జోన్​లో ఉన్న మయన్మార్​లో తరచూ భూకంపాలు వస్తుంటాయి (Myanmar Earthquake). గతంలో వచ్చిన వాటిలో కొన్ని తీవ్ర విధ్వంసం సృష్టించిన సంఘటనలు ఉన్నాయి. నిరుడు మార్చిలో 7.7 తీవ్రతతో వచ్చిన భూకంపం ఆ దేశంతోపాటు థాయ్​లాండ్​, చైనాలోనూ ప్రాణ, ఆస్తి నష్టం కలిగించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>