మంత్రులతో ముగిసిన రేవంత్ భేటీ.. మున్సి‘పోల్స్‌’పై కీలక సూచనలు

కలం, వెబ్ డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మంత్రులతో నిర్వహించిన కీలక సమావేశం మంగళవారం రాత్రి ముగిసింది. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రాధాన్యతలు, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం, పాలనాపరమైన అంశాలపై మంత్రులకు దిశానిర్దేశం చేశారు. ప్రధానంగా మంత్రులందరూ జిల్లాలకు వెళ్లాలని, ప్రజలకు అందుబాటులో ఉంటూ క్షేత్రస్థాయి సమస్యలను పరిష్కరించాలని సీఎం ఆదేశించారు.

ప్రభుత్వ సర్వేల ప్రకారం వెనుకబడిన మున్సిపాలిటీల పరిస్థితిని ముఖ్యమంత్రి విశ్లేషించారు. ఆయా ప్రాంతాల్లో పాలనను మెరుగుపరచడంపై దృష్టి పెట్టాలని సూచించారు. జిల్లాల ఇంచార్జ్ మంత్రులు (Ministers) ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేయాలని, అభివృద్ధి పనులను పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయి పరిస్థితులపై మంత్రులు రోజువారీగా తనకు నివేదికలు సమర్పించాలని ముఖ్యమంత్రి కోరారు. పార్టీలో అసంతృప్తిగా ఉన్న నాయకులను గుర్తించి, వారితో చర్చలు జరిపి బుజ్జగించాలని మంత్రులకు సూచించారు. నాయకత్వం మధ్య సమన్వయం దెబ్బతినకుండా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి మంత్రులను ఆదేశించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>