Mobile Popup Ad
Mobile Popup Ad

మున్సిపల్ ఎన్నికల్లో 90 శాతం స్థానాలు గెలుస్తాం : మహేష్ గౌడ్

కలం, డెస్క్ : మున్సిపల్ ఎన్నికల్లో 90 శాతం స్థానాలు గెలుస్తామన్నారు టీపీసీసీ చీఫ్‌ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Goud). తాజాగా ఆయన మాట్లాడుతూ… ‘సీఎం రేవంత్ రెడ్డి, మీనాక్షి నటరాజన్ తో జరిగిన మంత్రుల మీటింగ్ లో నేను పాల్గొన్నాను. మున్సిపల్ ఎన్నికలపై చర్చించాం. ఈ ఎన్నికల్లో 90 శాతం స్థానాలు గెలుస్తాం. మంత్రులంతా జిల్లాల్లోనే ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. మాకు రెబల్స్ బెడద లేదు. ఇప్పటికే రెబల్స్ అందరూ విత్ డ్రా చేసుకున్నారు’ అంటూ చెప్పుకొచ్చారు మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Goud).

జగిత్యాల ఇష్యూపై పరిశీలిస్తున్నాం. రేపటితో సమస్య ముగిసిపోతుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ జిల్లాల్లో ఉండటం వల్ల రాలేకపోయారు. వారితో ఫోన్ లో మాట్లాడి మీటింగ్ వివరాలను తెలియజేశాం. ప్రస్తుతం మంత్రులందరూ మున్సిపల్ ఎన్నికలపై ఫోకస్ చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>