కలం, మహబూబ్ నగర్ బ్యూరో: బహుజన రాజ్యాధికార పోరాట యోధుడు సర్వాయి పాపన్న గౌడ్ (Sarvai Papanna Goud) అని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ (DK Aruna) అన్నారు. సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా మహబూబ్‌నగర్ (Mahabubnagar) పట్టణంలోని పద్మావతి కాలనీ గ్రీన్ బెల్ట్‌లో నిర్వహించిన జయంతి వేడుకల్లో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి (Yennam Srinivas Reddy) తో కలిసి ఆమె పాల్గొన్నారు. సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా పోరాడి, బడుగు, బలహీన వర్గాల ఆత్మగౌరవం కోసం నిరంతరం కృషి చేసిన మహనీయుడు సర్వాయి పాపన్న గౌడ్ అని కొనియాడారు. సమాజంలోని అణగారిన వర్గాలకు సమాన హక్కులు, ఆత్మగౌరవం కల్పించాలనే లక్ష్యంతో సర్వాయి పాపన్న గౌడ్ సాగించిన పోరాటం స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఆయన ధైర్యసాహసాలు, ప్రజల కోసం చేసిన పోరాటం నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని, సమాజంలోని అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పిస్తూ అభివృద్ధి, సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు.
సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని సమానత్వం, సామాజిక న్యాయం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి, రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్, జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, నగర మేయర్ గుమ్మాల మమత శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వినోద్ కుమార్, సత్తూర్ చంద్రకుమార్ గౌడ్, సీజే బెనహర్, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

