కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ జిల్లా ఇల్లందుకుంట (Ellanthakunta) మండల కేంద్రంలోని సీతా రామచంద్ర స్వామికి ఓ ముస్లిం మహిళ శ్రీరామనవమి సందర్భంగా పట్టు వస్త్రాలను సమర్పించింది. జమ్మికుంట పట్టణానికి చెందిన భాను లేడీస్ టైలర్ నిర్వాహకురాలు అబేధాబాను పట్టు వస్త్రాలను తలంబ్రాలతో బుధవారం ఆలయ అధికారులకు అప్పగించారు. ముస్లిం మహిళ పట్టు వస్త్రాలు సమర్పించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తూ మతసామరస్యాన్ని చాటిందని అభినందించారు.
Read Also: పీఆర్సీ అంశంలో ఉద్యోగులకు మళ్ళీ నిరాశే !!
Follow Us On: Instagram

