కలం, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) నేడు ఏపీలోని విశాఖపట్నంలో పర్యటించారు. ఎయిర్ పోర్టులో అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. విశాఖలోని ఇనార్బిట్ మాల్లో ‘AAA సినిమాస్’ను ఆయన నేడు ఘనంగా ప్రారంభించారు. ఆ తర్వాత నోవాటెల్ హోటల్‌కు వెళ్లారు. అక్కడ కొంతసేపు విశ్రాంతి తీసుకొని తిరిగి స్పెషల్ ఫ్లైట్‌లో హైదరాబాద్‌కు వెళ్లనున్నారు.

