Mobile Popup Ad
Mobile Popup Ad

తమిళనాడు సీఎం విజయ్‌ను కలిసిన థమన్

కలం, సినిమా : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో ఘన విజయం సాధించి సీఎంగా భాద్యతలు చేపట్టిన దళపతి విజయ్‌ను(CM Vijay).. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ (Thaman) మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా దళపతి విజయ్‌కు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) పార్టీ కోసం థమన్ మూడు స్పెషల్ సాంగ్స్  కంపోజ్ చేసిన విషయం తెలిసిందే. టీవీకే పార్టీ కార్యక్రమాలు, ఎలక్షన్ ప్రచారాలలో ఈ పాటలు విస్తృతంగా వినిపించాయి. అలాగే 2024 ఆగష్టులో విడుదలైన ‘టీవీకే ఫ్లాగ్ ఆంథెమ్’ పాటను కూడా థమనే స్వరపరిచారు. ఈ పాట పార్టీ కార్యకర్తలలో ఉత్సాహాన్ని నింపడంతో పాటు సోషల్ మీడియాలో కూడా సూపర్ రెస్పాన్స్ దక్కించుకుంది. తాజా భేటీతో విజయ్-థమన్ మధ్య ఉన్న సాన్నిహిత్యం మరోసారి చర్చనీయాంశమైంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>