ఏపీ హోం మంత్రి వార్నింగ్.. కఠిన చర్యలు తప్పవు!

కలం, వెబ్ డెస్క్: ఏపీ ప్రభుత్వం, పోలీస్ శాఖపై దుష్ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని హోం మంత్రి అనిత (Home Minister Anitha) హెచ్చరించారు. ప్రొఫెసర్ నాగేశ్వర్‌ను అరెస్ట్ చేసేందుకు ఏపీ పోలీసులు హైదరాబాద్‌లోని ఆయన ఇంటికి వెళ్లారని ఓ మీడియా సంస్థ పోస్ట్ చేయగా.. ఏపీ ఫ్యాక్ట్ చెక్ విభాగం ఖండించింది. ఇది పూర్తిగా అవాస్తవమని.. ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టేందుకే, ప్రజల్లో అయోమయం సృష్టించి, వ్యక్తుల ప్రతిష్ఠను దిగజార్చడమే లక్ష్యంగా ఇలాంటి తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నారని పేర్కొంది. దీనిపై హోం మంత్రి స్పందిస్తూ.. ఏపీ పోలీసులపై ఇలాంటి ఫేక్ ప్రచారాలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. దురుద్దేశపూర్వకంగా ఇలా వ్యవహరించిన వారిపై కఠిన న్యాయ, పోలీస్ చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

నాగేశ్వర్‌పై వెనక్కి తగ్గినట్లేనా..?

పవన్ కళ్యాణ్ అమిత్ షాను కలిసినప్పుడు జగన్ అరెస్ట్ అంశాన్ని ప్రస్తావించగా.. అమిత్ షా తిరస్కరించినట్లు జనసేన విశ్వసనీయ వర్గాల ద్వారా తనకు సమాచారం ఉందని ప్రొఫెసర్ నాగేశ్వర్ ఓ టీవీ డిబేట్‌లో చెప్పడం వివాదానికి ఆజ్యం పోసింది. దీన్ని ఖండించిన జనసేన నేతలు.. ఆయనపై ఏపీలో పలు చోట్ల ఫిర్యాదులు చేయగా, కేసులు నమోదు అయ్యాయి. చివరికి పవన్ కళ్యాణ్​ సైతం రియాక్ట్ అయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలో, నాగేశ్వర్‌ను అరెస్ట్ చేస్తారనే ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే, తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లుగా ఆయన ప్రకటించడంతో ఈ అంశాన్ని ఇక్కడితో వదిలేయాలని ఏపీ ప్రభుత్వ పెద్దలు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>