Mobile Popup Ad
Mobile Popup Ad

ప్రజాస్వామ్య పద్ధతిలోనే ‘మూసీ’ పునర్జీవనం: డిప్యూటీ సీఎం భట్టి

కలం, వెబ్​ డెస్క్​: మూసీ పునర్జీవనం పనులు ప్రజాస్వామ్య పద్ధతిలో కొనసాగుతాయని డిప్యూటీ సీఎం, మూసీ క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) అన్నారు. మంగళవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో మంత్రి, మూసీ క్యాబినెట్ సబ్ కమిటీ సభ్యుడు పొన్నం ప్రభాకర్‌తో కలిసి మూసీ పునర్జీవనం పనుల ప్రగతిపై అధికారులతో చర్చించారు. మార్చి 31 నుంచి ఏప్రిల్ 15 వరకు ఆన్ లైన్‌లో musirdc@gmail.com మెయిల్ ఐడీ ద్వారా మూసీ పునర్జీవనంపై ప్రజల అభిప్రాయాలు స్వీకరిస్తామని తెలిపారు. ఆన్‌లైన్‌లో వచ్చిన సలహాలు, సూచనలను అన్నింటిని అధికారులతో కూర్చొని విశ్లేషణ చేస్తామన్నారు. ఆ తర్వాత దశలవారీగా సబ్ కమిటీ సభ్యులు సంప్రదింపులు చేస్తారని డిప్యూటీ సీఎం తెలిపారు.

మూసీ (Musi) నది ఒడ్డున ఓంకారేశ్వర ఆలయం పనులకు మార్చి 28న శంకుస్థాపన జరిగిందని, ఆ రోజు నుంచి మూసీ ఫేస్ -1, ఫేస్- 2 వరకు చేయాల్సిన పనులకు సంబంధించిన రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేసుకోవాలని డిప్యూటీ సీఎం అధికారులను ఆదేశించారు. డిఫెన్స్ భూములు, మూసీ పునరావాసితులతో సంప్రదింపులు, నిర్మాణ డిజైన్లు తుది దశకు తీసుకురావడం, బ్యాంకర్స్‌తో మాట్లాడటం లాంటి పనులను విభజన చేసుకొని ముందుకు వెళ్లాలని అధికారులకు డిప్యూటీ సీఎం సూచించారు.

సీఎం రేవంత్ రెడ్డి యావత్ క్యాబినెట్ సంకల్పాన్ని అర్థం చేసుకొని అధికారులు ఉత్సాహంగా ముందుకు వెళ్లాలన్నారు. అధికారులకు ఎలాంటి సలహాలు, సూచనలు ఇతర ఏ అవసరాలు ఉన్న మూసీ సబ్ కమిటీ సభ్యులు 24 గంటలపాటు అందుబాటులో ఉంటారని తెలిపారు. ఈ సమావేశంలో స్పెషల్ సీఎస్ రంజన్, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ ఈవీ నరసింహారెడ్డి, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమి, అధికారులు వినయ్ కృష్ణారెడ్డి , అశోక్ రెడ్డి, కలెక్టర్లు హరిచందన, నారాయణరెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>