గడ్చిరోలిలో భారీగా మావోయిస్టుల లొంగుబాటు

కలం, వెబ్ డెస్క్: దేశంలో మావోయిస్టుల లొంగుబాట్లు కొనసాగుతూనే ఉన్నాయి. భారత్ మావోయిస్టు రహిత దేశమని ఇప్పటికే లోక్‌సభలో కేంద్రహోంమంత్రి అమిత్ షా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇంకా కొన్ని ప్రాంతాల్లో మావోయిస్టుల లొంగుబాట్లు కొనసాగుతుండటం గమనార్హం. మంగళవారం మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతమైన గడ్చిరోలి (Gadchiroli) పోలీసుల ఎదుట 9 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో ముగ్గురు ఏరియా కమిటీ మెంబర్లు, ఉండగా మరో ఆరుగురు ఇతరస్థాయి సభ్యులు ఉన్నారు. వీరి మీద మొత్తం రూ. 30 లక్షల రివార్డ్ ఉందని పోలీసులు పేర్కొన్నారు. లొంగిపోయిన మావోయిస్టుల నుంచి ఒక ఏకే 47 రివాల్వర్, 3 మ్యాగజైన్లు, 57 బుల్లెట్లు, 3 వాకీటాకీలు, 4 బ్యాటరీలు, 20 పెన్ డ్రైవ్ లు, 2 ఎస్ఎల్ఆర్ రైఫిల్స్, ఒక సింగిల్ షాట్ ఆయుధం, 50 డిటోనేటర్లు స్వాధీనం చేసుకున్నారు. 2025 నుంచి ఇప్పటివరకు 132 మంది మావోయిస్టులు లొంగిపోయారని పోలీసులు తెలిపారు. గడ్చిరోలి‌ ప్రాంతంలో మావోయిస్టు పార్టీ ప్రభావం పూర్తిగా తగ్గిపోయినట్టేనని పోలీసులు చెబుతున్నారు.

లొంగిపోయిన మావోయిస్టులు వీళ్లే..

1. దాసరి పిడే సన్ను వేకో (35)
2. రామాజీ అదామా పోటం (40)
3. శాంతి వంజా వడ్డే (35)
4. మనకు మసో పొడియం (35)
5. సరీతా రామ వెల్కమ్ (25)
6. లక్ష్మి అయతు కుంజం (26)
7. నందే జోగా మాడే (22)
8. రాకేష్ కొరాకే మజ్జి (30)
9. సుక్కి బామి కుంజం (22)

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>