ట్యాంక్ బండ్ శివకు సీఎం ఆర్థిక, ఉపాధి మద్దతు

కలం, వెబ్ డెస్క్ : ట్యాంక్ బండ్ శివ(Tank Bund Shiva) కు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కీలక సహాయం అందింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) స్వయంగా ఆయన కుటుంబానికి ఆర్థిక, ఉపాధి పరమైన మద్దతు ప్రకటించారు. ప్రజల ప్రాణాలను కాపాడుతూ సేవలు అందించిన ట్యాంక్ బండ్ శివ పరిస్థితి ఇటీవల సీఎం దృష్టికి చేరింది. ఉపాధి లేక కుటుంబ పోషణలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో సీఎం స్పందించారు.

ఈ సందర్భంగా శివ కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందజేసిన సీఎం, ఆయన కుమారుడు వేణుమాధవ్‌కు హోం గార్డు ఉద్యోగ నియామకపత్రం కూడా అందించారు. అంతేకాకుండా శివ కుటుంబానికి డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. ఉపాధి కోసం ట్యాంక్ బండ్ సమీపంలో స్విమ్మింగ్ పూల్ నిర్మించి ఇవ్వాలని శివ చేసిన వినతిని కూడా సీఎం పరిశీలించి, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈ సహాయం అందుకోవడం పట్ల ట్యాంక్ బండ్ శివ(Tank Bund Shiva), ఆయన కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ పరిస్థితిని గుర్తించి ముందుకు రావడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ప్రాణాలను రక్షించిన వ్యక్తికి ప్రభుత్వం అండగా నిలవడం ప్రశంసనీయమని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>