గట్టుప్పల్ మండల ఏర్పాటు నా రాజీనామా పుణ్యమే : ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి

కలం, నల్లగొండ బ్యూరో : గట్టుప్పల్ (Gattuppal) మండల ఏర్పాటు నా రాజీనామా పుణ్యమేనని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Rajgopal Reddy) చెప్పారు. గట్టుప్పల్ మండల కేంద్రంలో శుక్రవారం చేనేత రుణమాఫీ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తన చిన్ననాటి నుంచే చేనేత కార్మికుల సమస్యలపై అవగాహన ఉందన్నారు. గ్రామంలో చేనేత కార్మికులతో కలిసిమెలిసి జీవించేవాళ్లమని, టెక్నాలజీ పెరిగి మరమగ్గాలు వచ్చిన తర్వాత నేతన్నలకు కష్టాలు పెరిగాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నాగరిక ప్రపంచంలో ప్రజల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టిన ఘనత నేతన్నలదేనని కొనియాడారు. బట్టలు నేస్తున్న నేతన్నల జీవితాలు అంతంతమాత్రంగా ఉంటే.. అవి అమ్మి సొమ్ము చేసుకుంటున్నా వాళ్ల జీవితాలు మాత్రం చాలా బాగున్నాయన్నారు.

వారి సమస్యలపై అధ్యయనం చేసి నివేదిక రూపొందించి నేతన్నలను తీసుకొని ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తానని రాజగోపాల్ రెడ్డి (Rajgopal Reddy) హామినిచ్చారు. పేదరికంలో ఉండి చేనేత వృత్తి పైన ఆధారపడి జీవిస్తున్న నేతన్నల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి న్యాయం చేస్తానని భరోసానిచ్చారు. ప్రజా ప్రభుత్వం చేనేత కార్మికులను ఆదుకుంటుందని, నేతన్నల సమస్యలు తీర్చే వరకు వారి వెంట ఉంటానని చెప్పారు. అంతకుముందు నేతన్నల బీమా పథకం కింద ఏడుగురికి రూ.35 లక్షల విలువ చేసే చెక్కుల పంపిణీ చేశారు. అలాగే, చేనేత రుణమాఫీ పథకం కింద 141 మంది నేతన్నలకు రూ.1.10 కోట్ల విలువైన చెక్కులను పంపిణీ చేశారు.

Read Also: తెలంగాణలో రెచ్చిపోతున్న చైన్‌స్నాచర్స్.. ఒక్క నెలలోనే 15కుపైగా ఘటనలు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>