కలం, వెబ్ డెస్క్: మహిళల భద్రతకు పెద్దపీట వేస్తూ హైదరాబాద్ (Hyderabad) పోలీస్ కమిషనరేట్ పరిధిలో షీ నేత్ర (SHE Nethra) పేరుతో సరికొత్త విభాగాన్ని సీపీ సజ్జనార్ ప్రారంభించారు. మహిళల వ్యక్తిగత గోప్యతకు భంగం కలగకుండా చూసేందుకు జోన్‌కు ఒకటి చొప్పున మొత్తం 7 ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశారు. వారికి అత్యాధునిక కెమెరా డిటెక్టర్లను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హోటళ్లు, హాస్టళ్లు, మాల్స్ వంటి ఇతర బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడా రహస్య కెమెరాలు లేవని నిర్ధారించుకోవాల్సిన పూర్తి బాధ్యత ఆయా యాజమాన్యాలదేనని స్పష్టం చేశారు. ఒకవేళ ఎక్కడైనా నిబంధనలు అతిక్రమించి మహిళల భద్రతకు ముప్పు కలిగిస్తే, సంబంధిత యాజమాన్యాలపై కఠినమైన చర్యలు తీసుకుంటామని సజ్జనార్ హెచ్చరించారు.
Read Also: తెలంగాణలో రెచ్చిపోతున్న చైన్‌స్నాచర్స్.. ఒక్క నెలలోనే 15కుపైగా ఘటనలు
Follow Us On: X(Twitter)

