నిరుపేద కుటుంబానికి రాజగోపాల్ రెడ్డి ఆర్థిక సాయం

కలం, చండూరు: చండూరు మండలం పుల్లెంల గ్రామానికి చెందిన పెసర్ల చింతయ్య కుమారుడు పెసర్ల గౌతం అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ విషయాన్ని పుల్లెంల కాంగ్రెస్ నాయకులు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి (Raj Gopal Reddy) దృష్టికి తీసుకురాగా, ఆయన వెంటనే స్పందించాడు. రెండు లక్షల రూపాయలను ఆ గ్రామ కాంగ్రెస్ నాయకుల చేతుల మీదుగా అందజేశారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ముక్కామల వెంకన్న, ఉప సర్పంచ్ చెడిబుద్ధి ఉషయ్య, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు వడ్డగోని చంద్రశేఖర్ గౌడ్, మాజీ ఎంపీటీసీలు సీత యాదయ్య, వడ్డగోని రాఘవేందర్, చండూరు పీఎసీ‌ఎస్ మాజీ చైర్మన్ బొబ్బలి శ్రీనివాసరెడ్డి, మండల నాయకులు మందడి శంకర్ రెడ్డి, మాజీ గ్రామ శాఖ అధ్యక్షులు ఇర్గి వెంకన్న, గండు కేశవులు, వార్డు మెంబర్లు భూతరాజు బాలరాజు, రాసాల మంజుల వెంకన్న పాల్గొన్నారు.

Read Also: అరణ్య అర్బన్ పార్కును ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>