చక్రాల కుర్చీలో జీవితం.. ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూపులు

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: వికలాంగుల కోటాలో తనకు పెన్షన్ మంజూరు చేయాలని దివ్యాంగ తాపీ మేస్త్రీ (Disabled Mason) లక్ష్మయ్య ప్రభుత్వాన్ని కోరారు. మహబూబ్ నగర్ (Mahabubnagar) జిల్లా గణేష్ నగర్‌లో లక్ష్మయ్య తాపీ మేస్త్రీ పనిచేసి కుటుంబాన్ని పోషించుకునేవాడు. అయితే ఓ ప్రమాదంలో తన కుడి కాలు మోకాలు వరకు విరిగిపోయిందని, అప్పటి నుంచి ఆర్టిఫీషియల్ కాలుతో చక్రాల కుర్చీలో తిరుగుతున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు.

ప్రమాదంలో కాలు విరిగినప్పటి నుంచి తన భార్య కూలీ పని చేసి డబ్బులు సంపాదిస్తుందని, ఆ డబ్బుతోనే నేను, నా కొడుకు కాలం వెళ్లతీసుకొస్తున్నామని లక్ష్మయ్య ఆవేదన వ్యక్తం చేశాడు. తన పరిస్థితి ఇలా అయినప్పటి నుంచి కుటుంబం గడవడం కష్టంగా ఉందని, వికలాంగుల కోటాలో పెన్షన్ కోసం గత కొంతకాలంగా కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నానని, అయినా ప్రయోజనం లేకుండా పోయిందని వాపోయాడు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు సహాయం చేస్తుందని నమ్మి ఓట్లు వేశామని, కానీ తమ పరిస్థితి ఇలా అయిందని కన్నీరు మున్నీరయ్యారు. ప్రభుత్వం ఇప్పటికైనా తమ బాధను అర్థం చేసుకుని పెన్షన్ మంజూరు చేయాలని వేడుకున్నాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>