Mobile Popup Ad
Mobile Popup Ad

ఆస్తి పన్ను వసూళ్లపై నల్లగొండ మున్సిపల్ కమిషనర్ ఆకస్మిక తనిఖీ

కలం, నల్లగొండ: నగరపాలక సంస్థ ఆదాయాన్ని పెంచడం, నిర్దేశిత పన్ను వసూళ్ల లక్ష్యాలను చేరుకోవడమే ధ్యేయంగా నల్లగొండ (Nalgonda) మున్సిపల్ యంత్రాంగం చర్యలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా మంగళవారం పట్టణంలోని 38, 39వ డివిజన్లలో కొనసాగుతున్న డిమాండ్ నోటీసుల పంపిణీ ప్రక్రియను (Property Tax Collection Drive) మున్సిపల్ కమిషనర్ బచ్చలకురి శరత్ చంద్ర క్షేత్రస్థాయిలో ఆకస్మికంగా పరిశీలించారు. డివిజన్లలోని పన్ను చెల్లింపుదారుల ఇళ్లకు నేరుగా వెళ్లిన కమిషనర్, డిమాండ్ నోటీసుల పంపిణీ జరుగుతున్న తీరును స్వయంగా అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగరంలోని ప్రతి ఆస్తి యజమానికి తప్పనిసరిగా డిమాండ్ నోటీసు అందేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. పన్నుల బకాయిలపై ప్రజలకు అవగాహన కల్పించి, వారు సకాలంలో చెల్లించేలా ప్రోత్సహించాలని సిబ్బందికి సూచించారు. నోటీసుల పంపిణీని వేగవంతం చేసి, గడువులోగా వంద శాతం పూర్తి చేయాలని కమిషనర్ స్పష్టం చేశారు.

రోజువారీగా జరిగే ప్రగతిని ఉన్నతాధికారులు క్షుణ్ణంగా పర్యవేక్షించాలని ఆదేశించారు. పన్నుల వసూళ్లను పెంచేందుకు అధికారులు ఒక ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికతో (Property Tax Collection Drive) ముందుకు సాగాలని, ముఖ్యంగా పాత బకాయిల వసూళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు. ప్రతి వార్డు పరిధిలో జరుగుతున్న వసూళ్ల పురోగతిని నిరంతరం సమీక్షించాలన్నారు. ప్రజల నుంచి వచ్చే పన్నుల పరమైన ఫిర్యాదులు, సమస్యలను అధికారులు తక్షణమే పరిష్కరించి, పన్ను చెల్లింపుదారులకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించాలని కమిషనర్ ఆదేశించారు. నగరంలోని అన్ని డివిజన్ల అధికారులు, రెవెన్యూ సిబ్బంది పరస్పర సమన్వయంతో పనిచేసి పన్నుల వసూళ్లలో ఆశించిన లక్ష్యాలను సాధించాలని సూచించారు. మున్సిపల్ కమిషనర్ వెంట మున్సిపల్ రెవెన్యూ అధికారి జి. శివరాం రెడ్డి, ఆయా వార్డుల అధికారులు, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.

Read Also: నిరుద్యోగులపై లాఠీచార్జ్ అత్యంత హేయమైన చర్య: కేటీఆర్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>