Mobile Popup Ad
Mobile Popup Ad

అభివృద్ధి పనులను గడువులోపు పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్‌

కలం, వనపర్తి జిల్లా: వనపర్తి మండలంలోని నాగమ్మ తండా గ్రామ పంచాయతీని జిల్లా అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ (Kheemya Naik) మంగళవారం సందర్శించి పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామంలో నిర్మాణంలో ఉన్న గ్రామ పంచాయతీ భవనం, వీవో భవనాల పనులను పరిశీలించి నిర్మాణ పనులు నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని ఏఈ (పీఆర్) అధికారికి సూచించారు. పనుల నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని, నిర్మాణ నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు.

అనంతరం గ్రామ నర్సరీని తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ (Kheemya Naik), నర్సరీ నిర్వహణను మరింత మెరుగుపరచాలని సూచించారు. మొక్కల సంరక్షణ, వాటి పెంపకంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఫీల్డ్ ఆఫీసర్, సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. పర్యావరణ పరిరక్షణలో నర్సరీల పాత్ర కీలకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ), ఎంపీడీఓ, ఎంపీఓ, పంచాయతీ కార్యదర్శి, ఏఈ (పీఆర్) తదితర అధికారులు పాల్గొన్నారు. గ్రామ సర్పంచ్‌తో పాటు గ్రామస్తులు కూడా హాజరయ్యారు.

Read Also: ఆ విషయం సీఎం రేవంత్‌ రెడ్డికి తెలుసు: కిషన్ రెడ్డి

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>