కలం, నిజామాబాద్ బ్యూరో : మున్సిపల్ కార్మికులు (Municipal Workers) ఎదుర్కొంటున్న న్యాయమైన సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల (Ganesh Bigala) డిమాండ్ చేశారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న ఎలక్ట్రీషియన్లు, లైన్మెన్లు, పారిశుద్ధ్య కార్మికులు, డ్రైవర్లు, వాటర్ సెక్షన్ సిబ్బంది గత ఐదు రోజులుగా ధర్నా చౌక్‌లో చేపట్టిన సమ్మెకు నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల హాజరై తన పూర్తి మద్దతును ప్రకటించారు.
జీవో 52ను రద్దు చేయాలి
ఈ సందర్భంగా ఆయన (Ganesh Bigala) మాట్లాడుతూ.. మున్సిపల్ కార్మికులు తన కుటుంబ సభ్యులతో సమానమని, వారి సమస్యల పరిష్కారం కోసం ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఎల్లప్పుడూ అండగా ఉంటానని స్పష్టం చేశారు. ప్రభుత్వం వెంటనే జీవో 52ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఇస్తున్న 19,500 వేతనాన్ని పెంచి, కనీస వేతనంగా ₹26,000 అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షులు సిర్ప రాజు, మాజీ NUDA చైర్మెన్ ప్రభాకర్ రెడ్డి, సత్య ప్రకాష్ నవీద్ ఇక్బాల్, జగత్ రెడ్డి, అబ్దుల్ మతీన్ తదితరులు పాల్గొన్నారు.
Also Read : యూపీఐ చెల్లింపులపై కేంద్రం కీలక ప్రకటన
Follow Us On : WhatsApp

