కలం, వెబ్ డెస్క్ : మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) వైసీపీ అధినేతకు గట్టి హెచ్చరిక జారీ చేశారు. టీచర్ల జోలికి వస్తే దబిడి.. డిబిడే అంటూ వార్నింగ్ ఇచ్చారు. అనంతపురం జిల్లా రాప్తాడులో పర్యటించిన లోకేశ్ ఎన్టీఆర్, పరిటాల రవి విగ్రహాలను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. డీఎస్సీ చర్చకు తాను సిద్ధమని.. జగన్ సిద్దమా..? అంటూ లోకోశ్ సవాల్ విసిరారు.డటీచర్లంటే వైసీపీకి ఎందుకంత కక్ష్య.. జగన్ జాగ్రత్తగా ఉండూ, టీచర్ల జోలికి వస్తే ఎవరినీ వదిలిపెట్టం’ అని లోకేశ్ హెచ్చరించారు. విదేశాలకు వెళ్లాలంటే నీలాగా కోర్టు అనుమతి తీసుకుని వెళ్లట్లేదు అని ఎద్దేవా చేశారు. తాము నిజాయితీగా బతికేవాళ్లం అని లోకేశ్ వ్యాఖ్యానించారు.
Also Read : యూపీఐ చెల్లింపులపై కేంద్రం కీలక ప్రకటన
Follow Us On: X(Twitter)

