మున్సిపల్ ఎన్నిక‌ల్లో అస్త్రాలుగా బీఆర్ఎస్ బాకీ, కాంగ్రెస్ దోఖా కార్డులు.

క‌లం, మెద‌క్ బ్యూరో : ఉమ్మ‌డి మెద‌క్ (Medak) జిల్లాలో మున్సిపల్ ఎన్నిక‌ల సంద‌ర్భంగా అధికార కాంగ్రెస్ పార్టీ, ప్ర‌తిప‌క్ష బీఆర్ఎస్ పార్టీల ప్రచార‌మంతా కార్డులు చుట్టూ తిరుగుతుంది. ఎన్నిక‌ల స‌మ‌యంలో పార్టీలు  ఇచ్చిన హ‌మీల మీద చ‌ర్చ జ‌రిగేలా, త‌మ ప్ర‌త్య‌ర్ధుల‌ను ఇరుకున‌ పెట్టాలనే ల‌క్ష్యంగా ముద్రించిన కార్డులు ఒక‌రు బాకీ కార్డు (Baki Card) అంటే మ‌రొక‌రు దోఖా కార్డు‌ను (Dhokha Card) కౌంట‌ర్‌గా ప్లాన్ చేశారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చి రెండేళైన ఇచ్చిన హ‌మీల‌ను నేర‌వెర్చ‌లేద‌ని బాకీ కార్డుల పేరుతో బీఆర్ఎస్ పార్టీ ప్ర‌చారం (Card Campaign) చేస్తుంటే.. 9 ఏళ్ల బీఆర్ఎస్ పాల‌న‌లో వివిధ వ‌ర్గాల‌ను మోసం చేసింద‌ని దోఖా కార్డు పేరుతో కాంగ్రెస్ పార్టీ కౌంట‌ర్ అటాక్ మొద‌లుపెట్టింది.

హామీలను గుర్తుచేసేలా కార్డులు

మున్సిపల్ ఎన్నిక‌లు (Municipal Elections) పూర్తిగా స్దానిక స‌మ‌స్య‌ల కేంద్రంగా, అభ్య‌ర్ధుల మీద అధార‌ప‌డి జ‌రుగుతాయి. అంతేకాకుండా మున్సిపాలిటి సంబంధించిన సమ‌గ్ర‌ అభివ్ర‌ద్ధి ప్ర‌ణాళిక‌తో, త‌మ త‌మ వార్డుల‌లో స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం అజెండాతో ప్ర‌చారం చేస్తుంటారు. అయితే ఈ ఎన్నిక‌ల‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకొన్న కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఏ అవ‌కాశంను వ‌ద‌ల‌డం లేదు. విజ‌య‌మే ల‌క్ష్యంగా ఓట‌ర్ల‌ మ‌ద్ద‌తు సంపాదించ‌డానికి అన్నిర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఇంటింటికి ప్ర‌చారం చేస్తున్న సంద‌ర్భంగా స్ధానిక అంశాల‌తో కూడిన మ్యానిఫెస్టోతో  పాటు ఈ కార్డుల‌ను పంపిణీ (Card Campaign) చేస్తున్నారు.

Read Also: గ్రూప్‌-1 వ్య‌వ‌హారంలో హైకోర్ట్ తీర్పుపై స్పందించిన సీఎం రేవంత్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>