epaper
Wednesday, February 18, 2026
epaper

భారత్‌తో మ్యాచ్ బాయ్‌కాట్.. పాక్‌కు న్యాయ చిక్కులు తప్పవా..!

కలం, వెబ్ డెస్క్:  టీ20 వరల్డ్ కప్ 2026లో (T20 World Cup) భారత్‌తో మ్యాచ్ ఆడకూడదన్న పాకిస్థాన్ నిర్ణయం భారీ దుమారం రేపుతోంది. ఈ నిర్ణయంపై ICC కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. బ్రాడ్‌కాస్టర్స్ కూడా పాక్ నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై కోర్టును ఆశ్రయించాలని బ్రాడ్‌కాస్టర్‌లో భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 15న కొలంబోలో జరగాల్సిన భారత్–పాక్ మ్యాచ్‌ను (India Pakistan Match) బహిష్కరించాలని పీసీీబీ నిర్ణయించింది. ఈ నిర్ణయం ప్రభుత్వ ఆదేశాల మేరకు తీసుకున్నదని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ వెల్లడించారు. అయితే, ఆ కారణాలను ఇంకా రాతపూర్వకంగా ఐసీసీకి తెలియజేయలేదు.

బంగ్లాదేశ్‌ను (Bangladesh) టోర్నీ నుంచి తొలగించిన అంశానికి సంఘీభావంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. రాజకీయ కారణాలు ప్రస్తావనకు వచ్చినా, అధికారిక వివరణ లేకపోవడం సమస్యగా మారింది. ఈ మ్యాచ్ తటస్థ వేదిక శ్రీలంకలో జరగాల్సి ఉంది. ఇది పీసీబీ ముందే అంగీకరించిన షరతే. గతంలో భారత్ కూడా తటస్థ వేదికలపై పాకిస్థాన్‌తో మ్యాచ్‌లు ఆడింది. దీంతో పీసీబీ వాదన బలహీనంగా మారింది.

అధికారిక ప్రసార సంస్థ జియోస్టార్ న్యాయ చర్యలకు వెళ్లే అవకాశం ఉందని ఐసీసీ హెచ్చరించింది. భారత్–పాక్ మ్యాచ్‌లు (India Pakistan Match) జరుగుతాయన్న అంచనాలపైనే మీడియా హక్కుల ఒప్పందం కుదిరింది. ప్రస్తుత చక్రంలో నాలుగు భారత్–పాక్ మ్యాచ్‌ల ద్వారా దాదాపు ఒక బిలియన్ డాలర్ల ఆదాయం ఉంటుందని ప్రసార సంస్థలకు హామీ ఉంది. ఒక మ్యాచ్ నుంచి తప్పుకోవడం ఒప్పంద ఉల్లంఘనగా పరిగణిస్తున్నారు.

ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌కు వచ్చే వార్షిక ఆదాయ వాటా, సుమారు 35 మిలియన్ డాలర్లను నిలిపివేయాలని ఐసీసీ ఆలోచిస్తోంది. ఆ మొత్తాన్ని ప్రసార సంస్థలకు పరిహారంగా మళ్లించే అవకాశం ఉంది. పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నక్వీ న్యాయ నిపుణులతో చర్చించి ప్రధానికి వివరించినట్టు సమాచారం. అయితే ఐసీసీ డిస్ప్యూట్ రిజల్యూషన్ కమిటీ ద్వారా ఉపశమనం దొరికే అవకాశం తక్కువగా ఉందని వర్గాలు చెబుతున్నాయి.

Read Also: వరల్డ్ కప్‌‌లో భారత్‌ ముందున్న డేంజర్ అదొక్కటే : వరుణ్ ఆరోన్

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>