కలం, నేషనల్ డెస్క్ : గణేష్ నవరాత్రి వేడుకల్లో భాగంగా ముంబై మహానగరంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. లాల్‌బాగ్ (Lalbaug Electrocution ) కాలచౌకి ప్రాంతంలో ఉన్న గణేష్ మండపం వద్ద ఘోర ప్రమాదం జరిగింది. దత్తారామ్ లాడ్ మార్గ్‌లోని కాళాచౌకి విభాగ సార్వజనిక్ ఉత్సవ్ మండపం సమీపంలో ఉన్న తాత్కాలిక తాగునీటి స్టాల్ వద్ద విద్యుత్ షాక్ వ్యాపించింది. ఈ ప్రమాదంలో 8 ఏళ్ల చిన్నారి సహా ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం తెల్లవారుజామున భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన సమయంలో ఈ సంఘటన జరిగింది. వర్షం కారణంగా నీరు నిలవడం, విద్యుత్ లైన్లలో షార్ట్ సర్క్యూట్ ఏర్పడటంతో ప్రాంగణంలో కరెంట్ ప్రసరించినట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. కాగా, ప్రమాద సమాచారం అందుకున్న విద్యుత్ సిబ్బంది, పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని విద్యుత్ సరఫరా నిలిపివేసి ప్రాంతాన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రమాదంలో 8 ఏళ్ల చిన్నారి రాఘణి ఘన్‌శ్యామ్ యాదవ్ అక్కడికక్కడే మరణించింది. విద్యుత్ షాక్ కు గురైన సమీప ఆసుపత్రికి తరలించగా, వారిలో ఇద్దరు మరణించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై కాలచౌకి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

