అదుపుతప్పిన బైక్.. లారీ కింద పడి మహిళ దుర్మరణం!

​కలం, ఖమ్మం బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండల కేంద్రంలో ఆదివారం రోడ్డు ప్రమాదం (Tekulapalli Accident) చోటుచేసుకుంది. ఇల్లందు వైపు నుంచి కొత్తగూడెం మార్గంలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న దంపతులను మృత్యువు లారీ రూపంలో కబళించింది.

​స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రయాణంలో ద్విచక్రవాహనం అదుపుతప్పి సమీపంలోనే వెళ్తున్న లారీ కిందకు దూసుకెళ్లింది. లారీ టైర్ల కింద పడి గూగులోత్ ఉమ అనే మహిళ అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. ప్రమాదంలో ఆమె భర్త తీవ్రంగా గాయపడటంతో ఆయన పరిస్థితి విషమంగా మారింది. స్థానికులు వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు.

​సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తూ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. మృతురాలికి సంబంధించిన పూర్తి వివరాలు, తెలియాల్సి ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>