రూ.113 కోట్లతో కరీంనగర్ మేక్ ఓవర్

కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ నగర పారిశుధ్యంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) ప్రత్యేక దృష్టి సారించారు. నగరంలో చెత్త సేకరణ సమర్థవంతంగా జరిగేందుకు ప్రతి డివిజన్ కు ఒక ట్రై సైకిల్ ను మున్సిపల్ సిబ్బందికి అందజేస్తున్నామని, నూతన ఫాగ్ మిషన్లు, అదనపు ట్రాక్టర్లను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నామని తెలిపారు. మొత్తం రూ.113 కోట్లతో కరీంనగర్ మేక్ ఓవర్ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆవరణలో మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు స్థానిక కార్పొరేటర్లతో కలిసి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ మున్సిపల్ శానిటేషన్ సిబ్బందికి నూతనంగా కొనుగోలు చేసిన ట్రైసైకిల్స్, ఫాగ్ మిషన్స్ ను అందజేశారు.

అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నగర అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలను వివరించారు. కరీంనగర్ లో చెత్త సేకరణ కోసం ప్రతి డివిజన్ కు ఒక ట్రై సైకిల్ ను మున్సిపల్ సిబ్బందికి అందజేస్తున్నాం. కొత్తగా కొనుగోలు చేసిన ఫాగ్ మిషన్లను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నాం. అదనంగా ట్రాక్టర్లను కొనుగోలు చేస్తున్నాం. కరీంనగర్ లో డంపింగ్ యార్డ్ సమస్యను పరిష్కరించబోతున్నాం. దీర్ఘకాలంగా వేధిస్తున్న డంపింగ్ యార్డ్ సమస్యకు ముగింపు పలకబోతున్నట్లు స్పష్టం చేశారు.

రూ.17 కోట్లతో బయోమైనింగ్ పనులకు వెంటనే టెండర్లు ప్రారంభమవుతాయని, రూ.80 కోట్లతో యూసీఎఫ్ నిధుల ద్వారా సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ పనులు చేపడతామన్నారు. రూ.16 కోట్లతో ఫ్రెష్ వేస్ట్ మేనేజ్ మెంట్ పనులను ప్రారంభించబోతున్నామని తెలిపారు. కరీంనగర్ లో గణేశ్ నవరాత్రి నిమజ్జన ఉత్సవాలను గతం కంటే ఘనంగా నిర్వహించబోతున్నామని, గతంకంటే ఎక్కువ బడ్జెట్ ను ఈసారి కేటాయించడం జరిగిందన్నారు. గణేశ్ నవరాత్రి ఉత్సవాలు అత్యంత పవిత్రమైనవని, గణేశ్ నవరాత్రి ఉత్సవాలను భక్తితో నిష్టగా ఎవరు చేసినా సక్సెస్ అవుతారన్నారు.

ఈసారి గణేశ్ నవరాత్రి ఉత్సవాల్లో మహిళల భాగస్వామ్యం ఎక్కువగా కన్పిస్తుండటం హర్షణీయన్నారు. ప్రతి ఒక్కరూ భక్తియుత, ధార్మిక వాతావరణంలో నిమజ్జన ఉత్సవాలు నిర్వహించాలని కోరారు. తప్పుడు ప్రచారాలు నమ్మొద్దని, పోలీసులకు పూర్తిగా సహకరించాలని కోరారు. ప్రశాంతతగా మారుపేరు కరీంనగర్ అని నిరూపిద్దామని పిలుపునిచ్చారు. అధికారులు, పోలీసుల నుండి ఏమైనా ఇబ్బందులుంటే మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లను సంప్రదించాలని, తప్పకుండా ఇబ్బందులను తొలగిస్తామని చెప్పారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>