పోచారంలో ‘రాంబాయి’ సీన్ రిపీట్‌.. యువ‌తికి హెచ్ఐవీ ఇంజెక్ష‌న్‌!

క‌లం, వెబ్ డెస్క్‌: హైద‌రాబాద్‌ (Hyderabad)లో దారుణ ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. ‘రాంబాయి’ సినిమా త‌ర‌హాలో ఓ యువ‌తికి హెచ్ఐవీ బ్లడ్ (HIV Blood) ఇంజెక్ష‌న్ ఎక్కించాడు ఓ దుర్మార్గుడు. త‌న‌తో పెళ్లికి నిరాక‌రించింద‌న్న కార‌ణంతో ఈ ఘాతుకానికి పాల్ప‌డ్డాడు. వివ‌రాల్లోకి వెళ్తే.. పోచారానికి (Pocharam) చెందిన‌ మనోహర్‌కు ఓ యువతితో వివాహం నిశ్చ‌య‌మైంది. కొద్ది రోజుల్లో వీరి పెళ్లి జ‌ర‌గాల్సి ఉంద‌న‌గా యువ‌కుడికి, అతడి తల్లిదండ్రులకు హెచ్ఐవీ ఉంద‌ని యువ‌తికి తెలిసింది. దీంతో పెళ్లి చేసుకునేందుకు నిరాక‌రించింది.

ఈ నెల 11న మ‌నోహ‌ర్ యువ‌తి ఇంటికి వెళ్లి త‌న‌ను పెళ్లి చేసుకోవాల‌ని ఒత్తిడి చేశాడు. యువ‌తి స‌సేమిరా ఒప్పుకోలేదు. దీంతో మ‌నోహ‌ర్ ముందుగానే ప్లాన్ ప్రకారం త‌న‌తో పాటు తెచ్చుకున్న ఓ ఇంజెక్ష‌న్‌ను యువ‌తికి వేశాడు. యువ‌తికి అది హెచ్ఐవీ ర‌క్తం (HIV Blood) ఉన్న ఇంజెక్ష‌న్ అని ఆల‌స్యంగా తెలిసింది. దీంతో పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు న‌మోదు చేసుకొని మ‌నోహ‌ర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Read Also: ఎగతాళి చేసిన వారే జేజేలు కొట్టారు!

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>