Mobile Popup Ad
Mobile Popup Ad

ధర్మ రక్షణకు నడుం బిగిద్దాం: ముక్తానంద స్వామీజీ

కలం, కరీంనగర్ బ్యూరో: హిందూ ధర్మ రక్షణకు ప్రతి హిందువు నడుం బిగించాలని ముక్తానంద స్వామి (Mukthananda Swamy) పిలుపునిచ్చారు. ఆదివారం కరీంనగర్‌ (Karimnagar)లోని బృందావన్ గార్డెన్‌లో హిందూ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన స్వామీజీ మాట్లాడుతూ.. హిందుత్వం మానవాళి హితం కోరే ధర్మమని, హిందువు మతతత్వవాది కాదని ఆయన చెప్పారు. మతం వేరు, ధర్మం వేరు అని పేర్కొన్నారు. హిందువుగా హిందూ ధర్మాన్ని, సంస్కృతిని తెలుసుకొని ఆచరించాలని వివరించారు. కుటుంబం నుండి పరివర్తన కోసం మహిళలు పాటుపడాలని కోరారు. దేవాలయాలను శక్తివంతం చేయాలన్నారు. హిందువుల‌ను కులాల వారీగా విభజించబడడం హేయమని, హిందువులు సమైక్యంగా కలిసి జీవించాలని సూచించారు.

ప్రధాన వక్తగా పాల్గొన్న ఆర్ఎస్ఎస్ విభాగ్ సంపర్క్ ప్రముఖ్ ఎన్నమనేని అశోక్ రావు మాట్లాడుతూ.. హిందువులు స్వాభిమానం, దేశభక్తి, సేవాభావం పెంపొందించుకోవాలని సూచించారు. మరొక మహిళా వక్త నీలిమా మాట్లాడుతూ పంచపరివర్తనతో కుటుంబంలో మార్పులు తీసుకురావాలని పిలుపునిచ్చారు. కుటుంబ జీవన విలువలు, సామాజిక సామ‌ర‌స్య‌త‌, పర్యావరణ పరిరక్షణ, పౌర విధులు అందరం పాటించాలన్నారు. సమ్మేళనంలో పాఠశాల విద్యార్థులు వేసిన‌ నాటికలు, సాంస్కృతిక నృత్యాలు అందరిని ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో సమితి అధ్యక్ష, కార్యదర్శులు గూడ అశోక్ రెడ్డి, మేకల ఓంప్రకాశ్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, కార్పొరేటర్లు నాంపల్లి రేణుక శ్రీనివాస్, సాగాని కొమురయ్య, దక్షిణామూర్తి, నాగరాజు, గజేందర్, రవీందర్, రాజిరెడ్డి, మల్లారెడ్డి, మామిడి రమేశ్, ఆదిరెడ్డి, భగత్ నగర్ బస్తీ లోని వివిధ కాలనీల నుండి తరలివచ్చిన ప్ర‌జ‌లు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>